Thursday, 5 November 2026

అభివృద్దిని అడ్డుకోవడమే జగన్‌ పని

అనంతపురం,జూలై12(జ‌నం సాక్షి): అభివృద్దిని పట్టించుకోని విపక్షనేత జగన్‌ అడుగడునా అడ్డుకుంటున్నారని మంత్రి పరిటాల సునీత అన్నారు. ముందస్తు ఎన్నికల ప్రణాళిక విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడమే జగన్‌ లక్ష్యంగా ఉందన్నారు. రాష్ట్రంలో జరిగే అభివృధ్ధి పనులను అడ్డుకోవడమే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పనిగా ఉందని ఆరోపించారు. రాజధానిని అడ్డుకుంటున్నారు..పట్టిసీమను అడ్డుకునే ప్రయత్నం చేశారు.. రుణమాఫీని అడ్డుకునే పని.. ఇలా ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుంటున్న ఆయనకు 2019 ఎన్నికలలో పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.