– సీఎం కేసీఆర్
మెదక్ అక్టోబర్ 11 (జనంసాక్షి):
మెదక్ జిల్లా జగదేపూర్ మండలంలో దత్తత తీసుకున్న గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఎర్రవల్లి, నర్సన్న పేట గ్రామాల్లో అభివృద్ధి పనులపై అధికారులు, గ్రామస్థులతో కలిసి సవిూక్ష నిర్వహించారు. కళ్లద్దాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పలువురు పేషంట్లకు అద్దాలను పంపిణీ చేశారు.ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు అభివృద్ధిలో పోటీ పడాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ రెండు గ్రామాల్లో ఎల్లుండి హెల్త్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. ప్రజలందరూ ఈ వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలందరూ ఐక్యంగా ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు.ఎర్రవల్లిలో నాలుగైదు రోజుల్లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నర్సన్నపేటకు 200 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరైనట్లు చెప్పారు. అలాగే పది పన్నెండు రోజుల్లో వీటి నిర్మాణాలను అధికారులు ప్రారంభిస్తారన్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే వరకు అధికారులు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తారని సీఎం చెప్పారు. ఈ తాత్కాలిక షెడ్లను గ్రామస్థులు వినియోగించుకోవాలని సూచించారు. వ్యవసాయం, డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.ఆ తర్వాత సీఎం కేసీఆర్ ప్రజ్ఞాపూర్ లో టీఆర్‌ఎస్ నేత కాంతారావు తల్లి మణికొండ చంద్రమ్మ దశ దిన కర్మకు హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చారు.





