Thursday, 5 November 2026

‘అమరావతి’కి బాబు ఆహ్వానం

C

– కేసీఆర్‌ ఇంటికి ఏపీ సీఎం చంద్రబాబు

– సాదరంగా స్వాగతించిన కేసీఆర్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌18(జనంసాక్షి):

నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. తిరుమల నుంచి హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు బేగంపేటలోని కేసీఆర్‌ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. చంద్రబాబు క్యాంప్‌ ఆఫీస్‌కు చేరుకోగానే కేసీఆర్‌ ఆత్మీయంగా పలకరిస్తూ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్‌కు శాలువా కప్పిన చంద్రబాబు శ్రీవారి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరుకావాల్సిందిగా కేసీఆర్‌ను చంద్రబాబు ఆహ్వానించారు. కేసీఆర్‌తో పాటు ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి తదితరులకు చంద్రబాబు బృందం ఆహ్వానపత్రం అందించారు. దాదాపు 8 నెలల తర్వాత తెలుగు రాష్గాల ముఖ్యమంత్రుల బ’ాటీ కావడంపై ఇరు రాష్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. చంద్రబాబు వెంట పలువురు మంత్రులు, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉన్నారు.

అమరావతి శంకుస్థాపనకు వస్తా: కేసీఆర్‌

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు తాను వస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్పారు. 50 నిమిషాల పాటు సాగిన బ’ాటీలో పలు అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు. ఈ సందర్భంగా అమరావతికి సంబంధించిన విశేషాలను కేసీఆర్‌కు చంద్రబాబు వివరించారు. అమరావతి అభివృద్ధి ప్రణాళిక, నదుల అనుసంధానంపై ఇద్దరూ చర్చించారు. నదుల అనుసంధానం అంశాన్ని కేంద్రమే చూసుకోవాలని కేసీఆర్‌ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

అనంతరం కేసీఆర్‌, చంద్రబాబు లోనికి వెళ్లారు. ఈ సందర్భంగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరుకావాల్సిందిగా కేసీఆర్‌ను చంద్రబాబు ఆహ్వానించారు. కేసీఆర్‌తో పాటు ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి తదితరులకు చంద్రబాబు బృందం ఆహ్వానపత్రం అందించారు. దాదాపు 8 నెలల తర్వాత తెలుగు రాష్గాల ముఖ్యమంత్రుల బ’ాటీ కావడంపై ఇరు రాష్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. చంద్రబాబు వెంట పలువురు మంత్రులు, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *