అమిత్‌షాపై దాడి జరిగితే అరెస్టు చెయ్యరా!

– చంద్రబాబు వెంటనే అమిత్‌షాకు క్షమాపణలు చెప్పాలి
– తిరుపతి ఎస్పీని వెంటనే సస్పెండ్‌ చేయాలి
– రాష్ట్రాభివృద్ధి కంటే చంద్రబాబు రాజకీయాలపైనే దృష్టిసారించాడు
– రోజుకొకరిని రెచ్చగొట్టి బీజేపీపై దాడి చేయిస్తున్నారు
– ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు
– విలేకరుల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
విజయవాడ,మే12(జ‌నం సాక్షి): ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిపై భయానక రీతిలో రాళ్లతో దాడిచేస్తే ఒక్కరివిూదా కేసు పెట్టరా? అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా? అంటూ ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. శనివారం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల మాట్లాడారు. చంద్రబాబుకే గనుక నిజాయితీ ఉంటే తక్షణమే అమిత్‌ షాకు క్షమాపణలు చెప్పాలని, తిరుపతి ఎస్పీని సస్పెండ్‌ చేసి, దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.
రాజకీయాల్లో విబేధాలు సహజమేనని, బీజేపీని రెచ్చగొట్టొద్దని మేము అనడంలేదన్నారు. కానీ టీడీపీ విధానమేంటో చెప్పమని అడుగుతున్నామన్నారు. చంద్రబాబు డబుల్‌ స్టాండర్డ్స్‌ని ప్రశ్నిస్తున్నామని, మొన్నటిదాకా మాతో కలిసున్నారు, నిన్నేమో హీరో శివాజీని ఎగదోశారు. ఆయనకే కార్పొరేషన్‌ ఇచ్చారు. చలసాని శ్రీనివాస్‌తో ఏవేవో చేయిస్తున్నారు. నిన్న ఎన్జీవో నాయుడు అశోక్‌ బాబును తెరపైకి తెచ్చారు. పవన్‌ కల్యాణ్‌ను తిట్టినాయనతో కిలిపి అశోక్‌ బాబును బెంగళూరుకు పంపారు. రేపు ఇంకెవరినో తీసుకొస్తారు. ఏంటి? అసలేం జరుగుతోంది? ఎటు నుంచి ఎటు తిరుగుతున్నాయి   విూ వ్యవహారాలు అంటూ సోమువీర్రాజు ప్రశ్నించారు. పరిపాలనను పక్కన పడేసి, అస్తమానం నిత్యం రాజకీయాలే చేస్తూండటం వెనుక ఏదో కుట్ర ఉందని మా అనుమానమని, ఇవన్నీ ప్రజలకు తెలియాలన్నారు 40 ఏళ్ల రాజకీయ జీవితమనే చంద్రబాబు డబుల్‌ స్టాండర్డ్స్‌పై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. 2004లో మోదీని తిట్టిన ఆయన 2014లో బీజేపీతో పొత్తుకు వెంపర్లాడారని, ఇప్పుడేమో బీజేపీకి ఒక్కసీటు కూడా రావద్దని అంటున్నారని, ప్రజలిచ్చే తీర్పుపైనా ఈయనకు అసహనమే అన్నారు. నాలుగేళ్లుగా 1200 హావిూలిచ్చారని, ¬దా కంటే ప్యాకేజీనే గొప్పదని చెప్పారని, వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని వీర్రాజు ఆరోపించారు. అసలు నిరసన తెలిపే హక్కు టీడీపీకి లేనేలేదని, ఏపీలో బీజేపీకి ఒక్కసీటు కూడా రాకూడదు అనడమేనా విూ రాజకీయం అని ప్రశ్నించారు. మాట్లాడితే జపాన్‌ తరహా ఉద్యమం అంటారు… అసలు భారతదేశంలో ఎలాంటి ఉద్యమాలు జరిగాయో ఈయనకు అవగాహన ఉందా? అందులో బీజేపీ పాత్ర ఏమిటో తెలుకునే మాట్లాడుతున్నారా? టీడీపీ ఒక కుట్రపూరిత దృక్పథంతో పనిచేస్తున్నదని అర్థమవుతోందని మండిపడ్డాడు. ప్రజలంతా దీనిని గమనించాలని కోరుతున్నామని, ఏపీకి ప్రత్యేక ¬దాతో కంటే ప్యాకేజీతోనే మేలు జరుగుతుందని, నిజంగా ¬దా కాంక్ష ప్రజల్లో ఉంటే టీడీపీ సైకిల్‌ యాత్ర ఎందుకు విఫలమవుతుందన్నారు.
బాలకృష్ణపై చంద్రబాబు చర్యలు తీసుకోలేదు
బీజేపీ ప్రధాన నేతలపై చంద్రబాబు కావాలనే తెదేపా నేతలను, కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారని సోమువీర్రాజు ఆరోపించారు. ప్రధాని మోదీపై బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేసినా చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డాడు. శనివారం అమిత్‌షాపై దాడి సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్నారు. అమిత్‌ షాకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సోమువీర్రాజు ఆరోపించారు. అమిత్‌ షాపై దాడి ఘటనకు సీఎం చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. దాడి ఘటనలో ఎవరిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

తాజావార్తలు