Monday, 2 November 2026

అమెరికాను కనుగొన్నది ముస్లింలే

Untitled-4

టర్కీ అధ్యక్షుడు

 

ఇస్తాంబుల్‌, నవంబర్‌ 17 (జనంసాక్షి) : అమెరికాను కనుగొన్నది ముస్లింలేనని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగన్‌ స్పష్టంచేశారు. కొలంబస్‌ కంటే మూడుశతాబ్దాల ముందే ముస్లిం నావికులు అమెరికా ఖండాన్ని కనుగొన్నారని చెప్పారు. ఆదివారం లాటిన్‌అమెరికా దేశాల ముస్లిం నేతల సమావేశంలో మాట్లాడిన ఆయన.. 12వ శతాబ్దం నుంచే ఇస్లాం, లాటిన్‌ అమెరికా మధ్య బంధం ఏర్పడిందని తెలిపారు. అమెరికాను 1492లో కొలంబస్‌ కొనుగొన్నారని చెప్తారు. కానీ ఇందులో నిజంలేదు. అతని కంటే 314ఏండ్ల ముందే అంటే 1178లోనే ముస్లిం నావికులు ఆ ప్రాంతానికి చేరుకొన్నారు అని చెప్పారు. క్యూబా తీరంలో ఎత్తైన కొండపై తాను ఓ మసీదును చూసినట్లు కొలంబస్‌ కూడా తన ఆత్మకథలో రాశారని ఈ సందర్భంగా ఎర్డోగన్‌ గుర్తుచేశారు. అయితే కొలంబస్‌ చెప్పినట్లుగా అక్కడ ముస్లింలు జీవించినట్లు చెప్పడానికి ఎలాంటి పురావస్తు ఆధారాలు లేవని గతంలోనే కొంతమంది శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *