అమెరికాలో ఇంట్లోకి దూసుకు వెళ్లిన స్కూల్‌ బస్‌

sw5j1ro0వాషింగ్టన్‌, మార్చి 26 : అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఓ స్కూల్‌ బస్‌ ఇంట్లోకి దూసుకు వెళ్లింది. ఫిలడెల్ఫియా శివారు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు ఇంటిని ఢీ కొన్న సమయంలో అందులో తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు. ఇంట్లో ఉన్న వాళ్లు కూడా ఎవరూ గాయపడలేదు. బస్సు డ్రైవర్‌కు మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి.