Tuesday, 3 November 2026

అమ్మ‌కానికి శిశువు

t5bctq48తూ.గో.,జిల్లా,  తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఈ గన్నవరం వుండలం ఏనుగుపల్లికి చెందిన ఓ యువతి పెళ్లి కాకుండానే గర్భం రావడంతో అమలారపురం ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు గమనించిన అదే వార్డులో ఉన్న మరో మహిళ మంగ ఆ బిడ్డను కొనేందుకు సిద్ధమైంది. ఇందుకు రూ. 10వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కొంత సొమ్ము అడ్వాన్స్‌గా ఇచ్చింది. ఆదివారం ఉదయం ఆ బిడ్డను తీసుకువెళ్లడానికి వచ్చిన మంగకు చేదు అనుభవం ఎదురైంది. బిడ్డను ఇచ్చేందుకు ఆమె నిరాకరించడంతో మంగ తన బంధువులను తీసుకువచ్చి గొడవకు దిగింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు నిందితురాలని అదుపులోకి తీసుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *