కృష్ణాజిల్లా, జిల్లాలోని మచిలీపట్నం, శుక్లాబాద్‌లో దారుణం జరిగింది. ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దుండుగులు దాడి చేసి నగలు దోచుకెళ్లారు. ఓ ప్రైవేట్ కళాశాలలో జూనియర్ ఆసిస్టెంట్‌గా పనిచేస్తున్న సునీత కళాశాల నుంచి ఇంటికి వచ్చి పనులు చేసుకుంటుండగా శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఇంట్లోకి జొరబడిన దుండగులు సునీత నోట్లో గుడ్డలు కుక్కి, కొట్టి… దోపిడీకి పాల్పడ్డారు. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న భక్త మధుబాబు హుటాహుటిన భార్యను ఆస్పత్రికి తరలించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




