సుందర్ కుమార్ దాస్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశం
హైదరాబాద్,డిసెంబర్30(జనంసాక్షి): రిటైర్డ్ డీజీపీ అరవిందరావుపై కేసు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఐసీఎస్ సుందర్ కుమార్ దాస్ 2009లో అరవింద రావుపై సైఫాబాద్ పోలీకులకు ఫిర్యాదు చేశారు. అరవిందరావుపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో సుందర్ కుమార్ దాస్ హైకోర్టును ఆశ్రయించారు. నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. 2009లో అరవిందరావు ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీగా ఉన్నరు. ఆ సమయంలోనే తను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినందుకు అరవిందరావు తనపై వివక్ష చూపుతున్నారని, తనను దూషిస్తునారని దాస్ ఆరోపించారు. అప్పట్లో దాస్ పవర్ జనరెషన్ కార్పొరేషన్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలోనే అరవింధరావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 ప్రకారం చర్యలు తీసుకోవాలని సైఫాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఉన్నత పదవికి సంబంధించి ఎప్పుడు తన పేరు వచ్చినా అరవిఅందరావు తనను పక్కన పెట్టేవారని దాస్ ఆరోపించారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సంఘటన తిరిగి ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో మళ్లీ వెలుగులోకొచ్చింది.





