Monday, 2 November 2026

మా పరీక్షలు మేమే నిర్వహించుకుంటాం

5

మాపై ఆంధ్రోళ్ల ఆధిపత్యమేంది

గవర్నర్‌కు తేల్చి చెప్పిన విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌,డిసెంబర్‌ 30(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఎంసెట్‌ నిర్వహణ వివాదంపై ఆయన గవర్నర్‌తో చర్చించారు. ఏపీ, తెలంగాణ రాష్గాల మధ్య ఎంసెట్‌ నిర్వహణపై వివాదం ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఎంసెట్‌ సొంతంగా నిర్వహించుకుంటుందని గవర్నర్‌కు స్పష్టం చేశారు. తెలంగాణ పై ఆంధ్రోళ్ల పెత్తనాన్ని సహించేది లేదని మంత్రి గవర్నర్‌కు తెలిపారు. ఇంటర్‌ పరీక్షల మాదిరిగానే ఎంసెట్‌ నిర్వహించుకుంటామని అన్నారు.

మరోవైపు సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం 2015 డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ సభ సందర్భంగా మంత్రి జగదీష్‌ మాట్లాడుతూ… అందరికీ ఒకే విద్యావిధానం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందరికీ సమాన విద్య అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడించారు. ఇంటర్‌లో అమలు చేసిన విధానమే…. ఎంసెట్‌లోనూ ఉంటుందని జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు.  ఎంసెట్‌ను తెలంగాణ ప్రభుత్వమే నిర్వహిస్తుందని స్పష్టంచేశారు. కెజి టూ పిజి విద్యకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ చేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *