Wednesday, 4 November 2026

అర్థవంతంగా అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ సమావేశల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు… అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా జరగాలన్నారు… ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధాలు ఇచ్చేందుకు, వివరణాత్మకంగా చెప్పేందకు మంత్రులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాలని… రాజకీయ రచ్చకు అసెంబ్లీ వేదిక కాకూడదన్నారు కేసీఆర్‌. ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను వివరించాలన్నారు సీఎం. సభ్యులు ఏ విషయాలనో లేవనెత్తే అవకాశముందో ప్రభుత్వం వాటిపై సన్నద్ధంగా ఉండాలన్నారు సీఎం కేసీఆర్‌. అన్ని అంశాలపై పూర్తి సమాచారాన్ని సిద్ధం చేసుkcrcm-609-26-1472196121కోవాలి సూచించారు కేసీఆర్‌. తమ శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలతో కూడిన రిపోర్టులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు కేసీఆర్‌. ప్రతీ అంశంపై సభ్యులకు అవగాహన ఉండాలన్నారు. సభ్యుల ప్రశ్నలకు సమాధాలు ఇవ్వడం… సభ్యులు ఇచ్చే సూచనలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కేసీఆర్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *