Thursday, 5 November 2026

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

jmp1gis6

చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, ఉత్తర కర్ణాటక మీదుగా లక్షద్వీప్ వరకు ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అటు అనుకోకుండా ముంచుకొచ్చిన అకాల వర్షాలు.. రైతన్న రెక్కల కష్టాన్ని తుడిచి పెట్టేస్తున్నాయి. మరో మూడు నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *