Tuesday, 3 November 2026

అవినీతి అధికారులపై ఉక్కుపాదం

l7y2ixf4నల్లగొండ మున్సిపాలీటీలో అవినీతికి పాల్పడి… కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మను ఖాజేసిన ఉద్యోగులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది… పురపాలక చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా నల్లగొండ మున్సిపాలీటీలో 21 మందిని సస్పెండ్‌ చేస్తూ… ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సర్వాత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. అవినీతి అక్రమాలకు పాల్పడితే ఎంతవారినైనా ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నవి.

నల్లగొండ మున్సిపాలీటీలో 2011 నుంచి 2015 మార్చి వరకు మూడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల అవినీతి జరిగినట్లు విజెలెన్స్ ఆడిటింగ్ లో బయటపడింది. దీంతో అక్రమాలకు పాల్పడి మున్సిపాలీటికి రావల్సిన సొమ్మును ఖాజేసిన 21 మందిని సస్పెండ్ చేస్తూ పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 21 మంది ఉద్యోగుల్ని వెంటనే విధుల నుంచి తొలగించి వారి స్దానంలో వేరే వారిని నియమించాలని ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా నల్లగొండ మున్సిపాలీటీ ఉద్యోగుల్లో కలకలం రేగింది. అవినీతికి పాల్పడిన వారిలో బిల్‌కలెక్టర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఉన్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు. వారిలో కొందరు ప్రస్తుతం సూర్యాపేట, పాలమూరుల్లో పనిచేస్తున్నారన్నారు. అక్రమంగా వారు దండుకున్న అమౌంట్‌ను కూడా రికవరీ చేయనున్నట్లు తెలిపారు.

వాయిస్‌.. అవినీతి అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అయితే మున్సిపాలిటీలో ఇంకా చాలా అవినీతి తిమింగళాలు ఉన్నాయని వాటిని కూడా గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు
ప్రభుత్వం అవినీతిపై ఉక్కుపాదం మోపుతుండటంతో మిగతా అవినీతి అధికారులు భయపడుతున్నారు. ఎక్కడ తమ బాగోతం బయటపడుతుందోనని లోలోపల జంకుతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *