Tuesday, 3 November 2026

ఢిల్లీలోని అబ్దుల్ కలాం పేరు

eyq2y7bjఇండియన్ మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఢిల్లీ గవర్నమెంట్ ఘన నివాళి అర్పించింది. ఆయన గౌరవార్ధం ఢిల్లీలోని ఔరంగజేబు రోడ్డుకు అబ్దుల్ కలాం పేరును పెట్టింది. ఢిల్లీలోని ప్రఖ్యాత ఔరంగజేబ్ రోడ్డు పేరును కలాం మార్గ్‌ గా మార్చుతూ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఉత్తర్వులు వెలువరించింది. దాంతో పాత బోర్డు స్థానంలో కలాం మార్గ్ పేరుతో బోర్డు దర్శనమిస్తోంది. పేరు మార్పు పట్ల ఢిల్లీ వారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పౌర సంఘం అభ్యర్థన మేరకు కేంద్ర హోంశాఖ పేరు మార్పుకు అంగీకారం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *