Wednesday, 4 November 2026

అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతిస్తాం: ఇంద్రసేనారెడ్డి

మిర్యాలగూడ : రాష్ట్ర ప్రభుత్వంపై అసెంబ్లీలో ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా భాజపా పూర్తి మద్దతు నిస్తుందని భాజపా జాతీయ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఒక హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. అవినీతి మంత్రులను తొలగించినందుకు ముఖ్యమంత్రిని ఆయన అభినందించారు. 26జీవోల విషయంలో సుప్రీంకోర్టు నుంచి తాకీదులందకున్న మిగతా మంత్రులను కూడా తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ కోసం అన్ని పార్టీల కలిసి పోటీ చేస్తే తప్పకుండా రాష్ట్రం సాధించుకుంటామని అశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *