గుంటూరు రైల్వే: ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టిక్కెట్ కలెక్టర్ గంగయ్యను సస్పెండ్ చేస్తూ సీనియర్ మండల వాణిజ్య అధికారి శ్రీరాములు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీసీపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణకు ఏసీఎం ఆలీఖాన్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు.




