అసెంబ్లీని ముట్టడిరచిన పోరు బిడ్డలు


కొదండరాం, విజయశాంతిసహ పలువురి నేతల అరెస్టు
హైదరాబాద్‌ అష్టదిగ్భందం
అసెంబ్లీ పై నల్లజెండా ఎగుర వేసి నిరసన తెలిపిన ఎమ్మెల్యేలు
రేపు తలెంగాణ బంద్‌ కు కేసీఆర్‌ పిలుపు

కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్‌ అరెస్టు
హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి బయలుదేరిన తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం, టీఎన్టీవోనేత శ్రీనివాస్‌గౌడ్‌ను అశోక్‌నగర్‌ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వైఖరికి నిరసనగా కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్‌లు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఐకాస కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో, పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఈసందర్భంగా కోదండరాం మాట్లాడుతూ…. ప్రజాస్వాయ్యం పద్దతిలో నిరసనతెలుపుతున్న తమపై ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఎక్కడికక్కడే నిరసనలు వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. చలో అసెంబ్లీకి ఎన్ని అడ్డంకులు సృష్టించినా నైతికంగా తెలంగాణ ప్రజలే విజయం సాధించారని కోదండరాం వ్యాఖానించారు. ఎన్ని అడ్డంకులు ఉన్నా ఉద్యమం కొనసాగుతుందని, ఈ రోజు సాయంత్రానికి ఉద్యమ కార్యచరణ ప్రకటించనున్నట్లు కోదండరాం చెప్పారు.
ఎంపీ విజయశాంతి అరెస్టు
హైదరాబాద్‌ : అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన మెదక్‌ ఎంపీ విజయశాంతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా విజయశాంతి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.      విధ్వంసాలకు పాల్పడవద్దు: హరీశ్‌రావు
హైదరాబాద్‌ : హింస మన మార్గం కాదు, విధ్వంసాలకు పాల్పడవద్దని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలంగాణ వాదులకు సూచించారు. నిరసన తెలిపే ప్రజల ప్రాథమిక హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని అన్నారు. అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజాస్వామ్య యుతంగా ధర్నా చేస్తామంటే ప్రభుత్వం అనుమతివ్వలేదని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకే తమ పోరాటమని వివరించారు.
ఎమర్జెన్సీ గుర్తుకు వస్తోంది: కూనంనేని
హైదరాబాద్‌ : భద్రతా ఏర్పాట్లు చూస్తే ఎమర్జెన్సీ కాలం గుర్తుకు వస్తోందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ…చలో అసెంబ్లీకి పిలుపునిస్తే ఈ స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడం సరిహద్దును తలపిస్తోందని వ్యాఖ్యానించారు.
పోలీసు వలయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం
హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం చుట్టూ పోలీసులు మోహరించారు. ఒక్క విద్యార్థిని కూడా క్యాంపస్‌ నుంచి బయటికి రాకుండా యూనివర్శిటికీ వెళ్లే అన్ని మార్గాలను మూసి వేశారు. ముళ్ల కంచెలు, బ్యారికేడ్లు వేసి పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి ఇప్పటికే క్యాంపన్‌కు చేరుకున్న విద్యార్థులు ఆర్ట్స్‌ కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరనున్నారు. మరి కొంతమంది ఒక్కొక్కరుగా ఇందిరా పార్క్‌కు చేరుకుని ఆందోళనలో పాల్గొనాలని భావిస్తున్నారు.
భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెన్‌ నిలిపివేత
వరంగల్‌ : భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెన్‌ను పోలీసులు కాజీపేటలో నిలిపివేశారు. దీంతో రైలులో ఉన్న ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు.
నల్గొండ జిల్లాలో 2500 మందిపై బైండోవర్‌: ఎస్పీ
నల్గొండ : చలో అసెంబ్లీ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో 2,500 మంది పై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ నవీన్‌గులాంటి తెలిపారు. మరో 260 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడిరచారు.
ఎంపీలు మందా జగన్నాథం, వివేక్‌ అరెస్టు
హైదరాబాద్‌ : అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఎంపీలు మందా జగన్నాథం, వివేక్‌, తెరాస నేతలు వినోద్‌, జితేందర్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీని ముట్టడిరచేందుకు నిజాంక్లబ్‌ వద్దకు చేరుకున్న ఎంపీలు, తెరాస నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మందా జగన్నాథం మాట్లాడుతూ… పోలీసు బలగాలతో ఉద్యమాన్ని అణచలేరన్నారు. చలో అసెంబ్లీని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.
ఓయూలో బాష్పవాయువు ప్రయోగం
హైదరాబాద్‌ : ఓయూ నుంచి అసెంబ్లీ ముట్టడికి ర్యాలీగా బయలు దేరిన విద్యార్థులను ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లురువ్వారు. విద్యార్థులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.
అసెంబ్లీ భవనంపైకి ఎక్కిన ఎమ్మెల్యేలు
హైదరాబాద్‌ : తెరాస ఎమ్మెల్యేలు కావేటి సమ్మయ్య, వినయ్‌ భాస్కర్‌లు శాసనసభలోని తెరాస శాసనసభాపక్ష కార్యాలయ భవనంపైకి ఎక్కి నిరసన తెలిపారు. నల్లచొక్కాలు ధరించి భవనంపై నుంచి తెలంగాణ నినాదాలు చేశారు.
లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద కవిత అరెస్టు
హైదరాబాద్‌ : అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవితతోపాటు, పలువురు తెరాస నేతలు, కార్యకర్తలను పోలీసులు లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద అరెస్టు చేశారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ…. శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తమను అడ్డుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. తెరాస కార్యకర్తలు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
.
శాసనసభ సోమవారానికి వాయిదా
హైదరాబాద్‌ : శాసనసభ సోమవారానికి వాయిదా పడిరది. రెండు సార్లు వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన వెంటనే తెరాస, భాజపా, తెదేపా సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. విపక్ష సభ్యుల అందోళన మధ్యే అర్థికమంత్రి అనంరాంనారాయణరెడ్డి సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అయిన పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను సోమారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అరెస్టు
హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి బయలుదేరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సహా, అపార్టీ కార్యకర్తలను లిబర్టీ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా పోలీసులు, సీపీఐ కార్యాకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
అశోక్‌నగర్‌ చౌరస్తా వద్ద భాజపా నేతలు అరెస్ట్‌
హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి బయలుదేరిన భాజపా సీనియర్‌ నేతలు విద్యాసాగర్‌రావు, లక్ష్మన్‌ సహా అపార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కార్యకర్తలను చెదరగొడుతుండగా విద్యాసాగర్‌రావు చేతికి గాయమైంది. ఈసందర్భంగా పోలీసులకు భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు అరెస్టు
హైదరాబాద్‌: అసెంబ్లీ ప్రాంగణంలో అందోళనకు దిగిన తెరాస, భాజపా, సీపీఐ ఎమ్మెలేలను పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీగేట్‌`1, గేట్‌`2 వద్ద అందోళనకు దిగిన తెరాస ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, కేటీఆర్‌తో పాటు అపార్టీ ఎమ్మెల్యేలను, భాజపా ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తదితరులతో పాటు, సీపీఐ ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావును పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం తెరాస ఎమ్మెల్యేలను గోల్కొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
భవనంపైకి ఎక్కిన తెరాస ఎమ్మెల్యేలు అరెస్టు
హైదరాబాద్‌ : శాసనసభ ప్రాంగణంలోని తెరాస శాసనసభాపక్ష కార్యాలయ భవనంపైకి ఎక్కి నల్లజెండాలు ఎగురవేసిన తెరాస ఎమ్మెల్యేలు కావేటి సమ్మయ్య, వినయ్‌భాస్కర్‌లను మార్షల్స్‌ అతి కష్టం మీద కిందకు దించారు. కిందకు వచ్చిన వెంటనే ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
దత్తాత్రేయ అరెస్టు
హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి కార్యకర్తలతో కలసి బయలుదేరిన భాజపా సీనియర్‌నేత బండారు దత్తాత్రేయను ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా కార్యకర్తలు తెలంగాణ నినాదాలు చేశారు.
ఆందోళన విరమించిన తెదేపా సభ్యులు
హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెదేపా తెలంగాణ ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్‌ సభను సోమవారానికి వాయిదా వేసిన తర్వాత కూడా ఆందోళన కొనసాగించారు. ముఖ్యమంత్రి, స్పీకర్‌ అసెంబ్లీ నుంచి వెళ్లిన తర్వాత తెదేపా సభ్యులు ఆందోళనను విరమించారు.
ఇందిరాపార్కుకు చేరుకుంటున్న తెలంగాణ వాదులు
హైదరాబాద్‌ : తెలంగాణ వాదులు విడతల వారీగా ఇందిరాపార్కుకు చేరుకుంటున్నారు. అక్కడ మోహరించిన వేలాది మంది పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి తరలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి ఇందిరాపార్కు వైపు బయలుదేరారు.
తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు
హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ సందర్భంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాసనసభ ప్రధాన ద్వారం వద్ద అందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌, కోత్తకోట దయాకర్‌తో పాటు పలవురు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి పోలీసు వాహనంలో తరలించారు.
సీఆర్‌పీసీ నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్‌ :అరెస్టుల విషయంలో సీఆర్‌పీసీ నిబంధనలు పాటించాలని రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చలో అసెంబ్లీ సందర్భంగా అరెస్టులు, నిర్భంధాలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు అదేశాలు జారీ చేసింది.

గాంధీలో వైద్యులను అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్‌ : గాంధీ ఆసుపత్రి నుంచి ఇందిరాపార్కు వరకూ ప్రదర్శనగా బయలుదేరిన వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం మూసివేసి వైద్యులను అక్కడే నిర్భంధించారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా వైద్యులు నినాదాలు చేశారు.
తెరాస ఎమ్మెల్యేలు, పోలీసులకు మధ్య తోపులాట
హైదరాబాద్‌ : గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో తెరాస ఎమ్మెల్యేలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీ అవరణలో ఆందోళనకు దిగిన తెరాస ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన అనంతరం గోల్కోండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గోల్కోండ పీఎస్‌లో తెరాస ఎమ్మెల్యేలు మాక్‌ అసెంబ్లీ నిర్వహించారు. మాక్‌ అసెంబ్లీకి అడ్డుకోవడంతో పోలీసులు, ఎమ్మెల్యేలకు మధ్య తోపులాట జరిగింది.
సొమ్మసిల్లి పడిపోయిన తెరాస నేత శ్రవణ్‌
హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇందిరాపార్క్‌కు చేరుకున్న తెరాస నేత శ్రవణ్‌ సొమ్మసిల్లి పడిపోయారు. శ్రవణ్‌తో పాటు అక్కడి చేరుకున్న తెరాస కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో తోపులాట జరిగింది. దీంతో రోడ్డుపై శ్రవణ్‌ సొమ్మసిల్లి పడిపోయారు. తేరుకున్న అనంతరం పోలీసులు శ్రవణ్‌ను అరెస్టు చేశారు.
ఎల్బీనగర్‌ చౌరస్తాలో ధర్నా 30 మంది అరెస్టు
నాగోలు: చలో అసెంబ్లీలో భాగంగా ఎల్బీనగర్‌ చౌరస్తాలో భాజపా నాయకులు స్వామిగౌడ్‌, యోగీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిల ఆధ్వర్యంలో 30 మంది ధర్నా చేశారు. వారిని ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టు చేసి సమీపంలోని ఒక ఫంక్షన్‌హాలుకు తరలించారు.
జూనియర్‌ న్యాయవాదుల అరెస్టు
నాగోల్‌ :చలో అసెంబ్లీకి తరలివెళ్తున్న తెలంగాణ వాదులను అడ్డుకుంటున్నందుకు నిరసనగా రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు జూనియర్‌ న్యాయవాదులు అందోళన చేపట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.