అసెంబ్లీ సమావేశాలకు పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణ ప్రజాసంఘాలు, వామపక్షాలు నేడు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. అదేవిధంగా 18 విద్యార్థి సంఘాలు కూడా ఛలో అసెంబ్లీని చేపట్టాయి. దీంతో అప్రమత్తమైన విద్యార్థి నాయకులతో పాటు వామపక్షాలు, ప్రజాసంఘాలకు చెందిన పలువురి నేతలను ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అన్ని జిల్లాల సరిహద్దులో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
అసెంబ్లీ దగ్గర భారీ బందోబస్తు




