Monday, 2 November 2026

అసోంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

-67కు చేరిన మృతుల సంఖ్య
7
-బోడో తీవ్రవాదులను ఉపేక్షించం

గౌహతి,డిసెంబర్‌24(జనంసాక్షి):  అసోంలో బోడో తీవ్రవాదులు సృష్టించిన మారణ¬మంలో మృతుల సంఖ్య 67కి చేరింది. సోనిట్‌పూర్‌, కొక్రాఝర్‌ జిల్లాల్లో బోడో తీవ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 67మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తీవ్రవాదులను పట్టుకునేందుకు రక్షణ దళాలు రంగంలోకి దిగాయి. ఇదిలావుంటే అసోంలో బోడో తీవ్రవాదుల మారణ¬మంపై నిరసనలు వెల్లువెత్తాయి. బోడో తీవ్రవాదుల దాడిలో దాదాపు 55 మంది మరణించారు. తీవ్రవాదులను అణచివేయాలంటూ అసోం వాసులు దిల్లీలోని అసోం భవన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఇక బోడో తీవ్ర వాదుల మారణ¬మం నేపథ్యంలో అసోం అంతటా ప్రభుత్వం ‘రెడ్‌ అలర్ట్‌’ ప్రకటించింది. సోనిట్‌పూర్‌, కొక్రాఝర్‌ జిల్లాల్లో బోడో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 67 మంది మృతి చెందారు. మృతుల్లో 21 మంది మహిళలు, 18 మంది చిన్నారులే అధికంగా ఉన్నారు. కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌  అసోంలో పర్యటించి పరిస్థితిని సవిూక్షించనున్నారు. అసోంలో తీవ్రవాదుల దాడులను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఖండించారు. తీవ్రవాదుల దాడులను తక్షణం అరికట్టాలని సూచించారు. మంగళవారంసోనిట్‌పూర్‌, కోక్రఝార్‌ జిల్లాల్లో ఎన్‌డీఎఫ్‌బీ(ఎస్‌) తీవ్రవాదులు నాలుగుచోట్ల జరిపిన దాడుల్లో 43 మంది మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మరో పదిమంది గాయపడ్డారు. మరణించిన వారిలో ఎక్కువమంది గిరిజనులే. ఇందలో మృతుల సంఖ్య బుధవారానికి 55కు చేరింది. ఈ ఘటనను ప్రధాని మోదీ ఖండించారు. మంగళవారం సాయంత్రం సోనిట్‌పూర్‌, కోక్రఝార్‌ జిల్లాల్లో 43 మందిని తీవ్రవాదులు కాల్చిచంపినట్లు అసోం పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. శాంతిచర్చలను వ్యతిరేకిస్తున్న నేషనల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడోల్యాండ్‌ (ఎన్‌డీఎఫ్‌బీ-సోంగ్బిజిట్‌) సంస్థ తీవ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటన అసోం, అరుణాచల్‌సరిహద్దుల్లో చోటుచేసుకుంది. సోనిట్‌పూర్‌ జిల్లాలో 4 ఠాణాల పరిధిలో కర్ఫ్యూ విధించారు.  తీవ్రవాదుల ఘాతుకాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రజల్ని చంపడం పిరికిచర్య అని ట్వీట్‌ చేశారు. ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, అసోం ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయిలతో మాట్లాడానని చెప్పారు. ఈ హింసాత్మక దాడి ఉగ్రవాద చర్య అని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇలాంటి దాడులను గట్టిగా తిప్పికొడతామని ఆయన స్పష్టంచేశారు. వీటిని సహించబోమన్నారు. అంతేగాకుండా వీరిని వదలబోమని హెచ్చరించారు. తీవ్రవాదుల దాడికి ఆగ్రహించిన ఆదివాసీలు, స్థానికులు కొన్నిచోట్ల ఎదురు దాడులకు దిగుతున్నారు. బోడో తీవ్రవాదుల ఇళ్లకు నిప్పంటించారు. వారికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తీవ్రవాదుల దాడులకు దిగ్భాంతి చెందిన కేంద్రం వెంటనే స్పందించి 5వేల మందికి పైగా భద్రత సిబ్బందిని అసోంకు పంపించింది. అసోం అంతటా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ పర్థసితిని సవిూక్షిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అసోంలో దాడులను తీవ్రంగా ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *