Tuesday, 3 November 2026

.విభజన చట్టంలో లొసుగులు సవరించాలి

8

-తెలంగాణ సర్కారుతో సంప్రదించాలి

-ఎంపీ వినోద్‌

ఢిల్లీ : ఏపీలో శాసనమండలి స్థానాల పెంపు నిర్ణయం అనాలోచితమని ఎంపీ వినోద్‌ అన్నారు. దిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలి సభ్యుల పెంపునకే చట్టాన్ని సవరించినట్లుగా ఉందన్నారు. రాజ్యసభ సభ్యుల మార్పును కూడా సవరించవచ్చని, విభజన చట్టంలోని షెడ్యూల్‌-2ని సవరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. విభజన చట్టంలో సవరణలకు ముందు రెండు రాష్గాలతో చర్చించాలన్నారు. ఏపీలో 8 మండలి స్థానాలు పెంపుపై తమకు అభ్యంతరం లేదన్న ఆయన రెండు రాష్గాలను సంప్రదించి సవరణలపై నిర్ణయం తీసుకోవాలన్నారు.

మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ  కూడా ఏపీ విభజన చట్టంలో లొసుగులున్నాయని అన్నారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలోని లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిలో భాగంగా రాజ్యసభ సభ్యుల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఎమ్మెల్సీల సంఖ్య విషయంలోనూ చట్టంలో పొరపాటు జరిగిందని అరుణ్‌ జైట్లీ అన్నారు. ఎమ్మెల్సీల సంఖ్య 58కి బదులుగా 50 అని ఉందని, దీనిని సరిచేస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం ఏపీ శాసనమండలిలో 50 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఏపీ శాసనమండలి సభ్యుల సంఖ్యను పెంచాలని నిర్ణయించడంతో ఆ సంఖ్య 58కి పెరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *