Thursday, 5 November 2026

అసోంలో చెలరేగిన అల్లర్లు..ముగ్గురి మృతి

గౌహతి: అసోంలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. కోక్రాఝర్‌ జిల్లా రాణిబులి గ్రామంలో బోడో వర్గాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను గౌహతి మెడికల్‌ కళాశాలకు తరలించారు. దీంతో అల్లర్లలో ఇప్పటివరకూ మృతి చెందినవారి సంఖ్య 64కు చేరింది, అల్లర్ల కారణంగా ఇప్పటికే చిరాంగ్‌ జిల్లాలో కర్ఫ్యూ కొనసాగుతోంది. తాజా ఘటనలతో కోక్రాఝర్‌ జిల్లాలో కూడా ఈ ఉదయం నుంచి కర్ఫ్యూను విధించారు. గత 48 గంటల్లో అల్లర్లు జరగడం ఇది రెండోసారి. ఆదివారం కోక్రాఝర్‌. చిరాంగ్‌ జిల్లాల్లో జరిగిన దాడుల్లో నలుగురు మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *