గహౌతి: అసోంలో రాష్ట్రంలోని రెండు గ్రామాల్లో బోడోలాండ్ మిలిటెం ట్లు దాడులకు పాల్పడ్డారు. మిలిటెంట్లు
విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడటంతో 35 మంది మృతి చెందారు. కోక్రాఝర్ జిల్లాలోని సరల్పర గ్రామం, సోనిట్‌పూర్ జిల్లాలోని శాంతిపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోక్రాఝర్ జిల్లాలో ఐదుగురు, సోనిట్‌పూర్ జిల్లాలో 30 మంది మృతి చెందినట్లు సమాచారం.అదనపు బలగాలను తరలిస్తున్నట్లు అధికా రులు తెలిపారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించే దిశగా చర్యలుతీసుకోవాలని అలాగే అవసరమైతే మరిన్నికేంద్ర బలగాలను పంపేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. పరిస్థితి చేదాటిపోకుండా రాష్ట్ర ప్రభుత్వ అప్రమత్తమై రెడ్ అలర్ట్‌ప్రకటించింది. కాల్పులు జరిపిన మిలిటెంట్ల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. మారుమూల ప్రాంతాల్లో బలగాలను దింపిముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
అసోంలో బోడో మిలిటెంట్ల దాడి.. 35 మంది మృతి




