ఏరియల్ సర్వే నిర్వహించిన సిఎం కెసిఆర్
నల్లగొండ,డిసెంబర్23: తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లా దామరచర్ల మం డలం వీర్లుపాలెంలో పర్యటించారు. కృష్ణా పరి వాహక ప్రాంతం ఫొటో గ్యాలరీని ఆయన పరిశీ లించారు. థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం స్థలపరిశీలన నిమిత్తం ఆయన ఈ ప్రాం తంలో విహంగవీక్షణం చేపట్టారు.జిల్లాలో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై ముఖ్యమం త్రి కేసీఆర్ అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ కేంద్రం కోసం స్థలాన్వే షణ, అటవీ భూముల సేకరణపై చర్చించారు. ఉదయం దామరచెర్ల, మఠంపల్లి, మేళ్లచెరువు ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. అక్కడి ప్రాంతాలను సీఎం పరిశీలించారు. వీర్ల పాలెంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీ ఎం తిలకించారు. కలెక్టర్ ఇతర అధికారులు వెంట ఉన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఏరి యల్ సర్వే నిర్వహించిన ఆయన ఈసారి నల్గొం డ జిల్లాలో పర్యటించారు. గతంలో రాచకొండ ఏరియాలో పర్యటించారు. ఇప్పటికే నాలుగు సార్లు నల్లగొండలో పర్యటించిన సిఎం కేసీఆర్ మంగళవారం మరోసారి పర్యటనకు సిద్ధమ య్యారు. తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదగిరి గుట్టకు
కృష్ణా పరివాహక ప్రాంతం ఫొటో గ్యాలరీ పరిశీలన
కేసీఆర్ రెండు సార్లు వెళ్లారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలపై సవిూక్షించారు. అలాగే రాచకొండ గుట్టల్లో ఫిల్మ్, ఫార్మా సిటీల ఏర్పాటు కోసం విహాంగ వీక్షణం చేశారు. ఇప్పటి వరకు చేసిన పర్యటనలన్నీ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే జరగ్గా ఈ సారి తెలంగాణ, ఆంధప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించారు. దామరచర్ల, మఠంపల్లిలో అపారమైన నాపరాతి గనులు ఉన్నాయి. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో సిమెంట్ ఉత్పత్తి పరిశ్రమలు ఉన్నాయి. నాగార్జున సాగర్ నీటి ద్వారా అక్కడ నెలకొల్పే పలు పరిశ్రమల కోసం అధికారులతో చర్చించనున్నారు. దామరచర్లలో పరిశ్రమల స్థాపనతో పాటు దాని అనుబంధ పరిశ్రమల ఏర్పాట్లపై ఆరా తీసారు. కృష్ణపట్టి ప్రాంతంలో థర్మల్ ప్లాంట్ ప్రజెంటేషన్ కోసం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసారు. థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆ ప్రాంతం అనువుగా ఉంటుందా..? లేదా..? అనే అంశాలను కేసీఆర్ పరిశీలించారు. ఒకవేళ అనువుగా ఉంటే ఇక్కడ ప్రభుత్వ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయో..? తెలంగాణ సీఎం తెలుసుకోనున్నారు.





