ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చడానికే బంద్
– వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
విశాఖపట్టణం,జూలై24(జనంసాక్షి): ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చడానికే వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర బందుకు పిలుపునిచ్చారని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఆయన విశాఖ బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ పిలుపునిచ్చిన రాష్ట్ర బందుకు ప్రజల నుండి పూర్తి మద్దతు లభిస్తుందని తెలిపారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చడానికే జగన్ రాష్ట్ర బందుకు పిలుపునిచ్చారన్నారు. ప్రజల నుంచి వస్తున్న మద్దతును సహించలేని సీఎం చంద్రబాబు పోలీసులు ద్వారా బందును అడ్డుకోవాలని చూస్తున్నాడు అని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుపడుతున్న సీఎం చంద్రబాబు చరిత్ర హీనుడవుతాడని వెంకటేశ్వర్లు ద్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు బంద్ కు మద్దతు ప్రకటించకపోవడం దురదృష్టకరమన్నారు. మేము వైసీపీకి మద్దతు కోరలేదని, రాష్ట్ర ప్రయోజనాలకు మద్దతు పలకాలని కోరామన్నారు. కాంగ్రెస్, టీడీపీలు తగిన మూల్యం చెల్లించుకుంటారు అని వెంకటేశ్వర్లు అన్నారు.