– మోదీ పాకిస్తాన్ హఠాత్‌పర్యటన
– స్వాగతించిన కాశ్మీర్ వేర్పాటువాదులు
– 11 ఏళ్ల తరువాత భారత ప్రధాని పాక్‌లో పర్యటన
– పాక్ ప్రధాని నవాజ్ తల్లికి మోదీ పాదాభివందనం
ఇస్లామాబాద్,డిసెంబర్25 (జనంసాక్షి): భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి లా¬ర్ చేరుకున్న నరేంద్ర మోదీకి లా¬ర్ విమానాశ్రయంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఘన స్వాగతం పలికారు. మోదీ ప్రధాని అయ్యాక పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈరోజు నవాజ్ షరీఫ్ పుట్టినరోజు కావడంతో పాటు, ఆయన మనవరాలి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పాక్ ప్రధానిక మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.కాగా పాకిస్థాన్‌లో భారత ప్రధాని పర్యటించడం 11 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2004లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి సార్క్ సదస్సు కోసం ఇస్లామాబాద్ వెళ్లారు. ఆకస్మికంగా పాక్‌లో పర్యటించిన తొలి ప్రధాని మోదీయే. ప్రధాని పదవి చేపట్టిన అనంతరం తొలిసారిగా మోదీ పాక్‌లో పర్యటిస్తున్నారు. అనంతరం లాహోర్ పాక్ ప్రధానితో నరేంద్ర మోదీ భేటి అయి పలు విషయాలు చర్చించారు.ఈ సంర్భంగా పాక్ ప్రధానికి మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా భారత ప్రధాని మోదీ పాక్ పర్యటను పురస్కరించుకుని లాహోర్ భద్రత కట్టుదిట్టం చేశారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకస్మికంగా పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న సందర్భంగా లా¬ర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేకంగా లా¬ర్ ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల భారీగా భద్రతా దళాలను మోహరించారు. పోలీసులతోపాటు పాకిస్థాన్ రేంజర్లు కూడా లా¬ర్ చేరుకుని భద్రతని పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని పాక్ పర్యటనను స్వాగతించిన కశ్మీర్ వేర్పాటువాదులు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్థాన్ పర్యటనను కశ్మీర్ వేర్పాటువాదులు స్వాగతించారు. శుక్రవారం ప్రధాని మోదీ లా¬ర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. మరోపక్క మోదీ పాక్ పర్యటనను వ్యతిరేకిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిల్లీలో ఆందోళన కార్యక్రమం జరిగింది.
పాక్ ప్రధాని తల్లికి మోదీ పాదాభివందనం
పాకిస్తాన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం, ఆతిథ్యం లభించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.. మోదీ కోసం ప్రత్యేక వంటకాలు చేయించారు. శు
క్రవారం సాయంత్రం లా¬ర్ నగర శివారు రాయ్‌విండ్‌లోని నవాజ్ షరీఫ్ నివాసానికి వెళ్లిన మోదీకి.. పాక్ ప్రధాని కొడుకు, ఇతర కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. షరీఫ్
తన కుటుంబ సభ్యులను మోదీకి పరిచయం చేశారు. అనంతరం ఇరు దేశాల ప్రధానులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని తల్లి అక్కడికి రాగా.. మోదీ ఆమెకు పాదాభివందనం చేశారు. నవాజ్ తన నివాసంలో మోదీకి ఏర్పాటు చేసిన విందులో ఆయనకు ఇష్టమైన సాగ్, దాల్, శాకాహార వంటకాలను వండించారు. మోదీకి ప్రత్యేకంగా కశ్మీరీ టీ అందజేశారు. షరీఫ్ పుట్టినరోజుతో పాటు ఆయన మనవరాలి పెళ్లి. పాక్ ప్రధాని మనవరాలి వివాహంలో అనుకోని అతిథిలా నరేంద్ర మోదీ తళుక్కున మెరిశారు. ఊహించనివిధంగా మోదీ పాక్ పర్యటనకు వెళ్లడం ఇరు దేశాల్లోనూ ఆశ్చర్యానికి గురిచేసింది. శుక్రవారం సాయంత్రం లా¬ర్ వెళ్లిన మోదీకి విమానాశ్రయంలో షరీఫ్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఇద్దరూ ప్రత్యేక హెలికాప్టర్‌లో షరీఫ్ నివాసానికి వెళ్లారు. షరీఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. ఆయన మనవరాలిని ఆశీర్వదించారు.
అనంతరం లా¬ర్ నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు. ‘పాక్ ప్రధాని ఎంతో ఆత్మీయత చూపారు. ఈ రోజు సాయంత్రం నవాజ్ ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడిపాను. షరీఫ్ జన్మదినం, ఆయన మనవారి వివాహం రెండు వేడుకల్లో పాల్గొన్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.కాగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వాగతించారని పాక్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ చౌదరి తెలిపారు. ఇరు ప్రధానుల భేటీ వివరాలను ఆయన వెల్లడిస్తూ.. స్నేహపూర్వక వాతావరణంలో మోదీ, నవాజ్ షరీఫ్ భేటీ జరిగింది. ద్వైపాక్షిక సంప్రదింపులు మెరుగుపరుచుకోవాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. చర్చల ప్రక్రియ ముందుకు తీసుకువెళ్లాలని ఇరువురు నేతలు ఆకాక్షించారని ఆయన పేర్కొన్నారు.
కాబూల్‌లో బ్రేక్‌ఫాస్ట్.. లా¬ర్‌లో లంచ్ !
నవాజ్ ఇంట్లో జరిగే విందు కోసం పాక్ ఘుమఘుమలు సిద్దం చేశారు.పాకిస్థాన్ హై కవిూషన్ సమాచారం మేరకు మోదీ విందు కోసం మటన్ ఫ్రై, పాలక్ పన్నీరు మెనూలో ఉన్నాయి. ఇరు దేశాలకు షాక్ ఇచ్చిన సడన్ స్టాప్ వల్ల ప్రపంచ విూడియా కూడా అవాక్కైంది. షరీఫ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పేందుకు మోదీ ఆకస్మికంగా లా¬ర్‌కు వెళ్లారనేది విూడియాకున్న సమాచారం. ఇదిలా వుండగా మోదీ పాక్ ఆకస్యిక పర్యటన సర్వత్రా చర్చ.. చర్చంతా ప్రధాని మోదీ పాకిస్తాన్ ఆకస్మిక పర్యటనపైనే జరుగుతోంది. మోదీ పాకిస్





