మహబూబ్‌నగర్, సెప్టెంబరు 10 : తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులతో ప్రతిరోజూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఘన్‌పూర్ మండలం అప్పారెడ్డిపల్లిలో పత్తిరైతు ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం సురంగల్‌లో అప్పుల బాధతో రైతు కేసరి నారాయణరెడ్డి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఓ రైతు రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా రాష్ట్ర పాలకులు పట్టించుకోవడం లేదు.
ఆగని రైతుల ఆత్మహత్యలు




