Tuesday, 3 November 2026

ఆటో బోల్తా ఒకరి మృతి

  ఆదిలాబాద్‌

మండల సమీపంలోని పొత్పెల్లిబి గ్రామంలో ఆటో బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం… గుడిసెర గ్రామానికి చెందిన శుంకర కిష్టయ్య మరో వ్యక్తితో కలిసి పొత్పెల్లిబి నుంచి లోకేశ్వరం వైపు ఆటోలో వస్తున్నాడు. అడవి పందులు అడ్డురావడంతో వాటిని తప్పించే క్రమంలో ఆటో బోల్తాపడింది. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం నిర్మల్‌ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుంకర కిష్టయ్య మృతి చెందినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *