Friday, 6 November 2026

ఆదర్శనేత పుచ్చలప్లలి

ఏలూరు,మే19(ఆర్‌ఎన్‌ఎ): పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో  చలివేంద్రాన్ని సిపిఎం సినియర్‌ నాయకుడు కేతా సూర్యారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల హక్కుల కోసం ఇంటి నుంచి పోరు సాగించిన దక్షిణ భారత కమ్యూనిస్ట్‌ ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య అని అన్నారు. సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లిన మొదటి ప్రతిపక్ష నేత అని గుర్తు చేశారు. ఆయన సేవలు అనన్య సామాన్యమన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని అన్నారు.