ఎస్సీ,ఎస్టీ చట్టం పరిరక్షణ కోరుతూ ఆందోళన
కర్నూలు,మే19( జనం సాక్షి): ఎస్సి, ఎస్టి అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలులో భారీ ర్యాలీ, కలెక్టరెట్ వద్ద నిరసన కార్యరక్రమాన్ని నిర్వహించారు. దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య స్వగ్రామం పెద్దపాడు నుంచి మొదలైన పాదయాత్ర రేడియో స్టేషన్ విూదగా కలెక్టరెట్ వద్దకు చేరుకుని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ర్యాలీలో నాయకులు కులవివక్షత, అంటరానితనం, అమానవీయ దాడులను రూపుమాపాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ ర్యాలీకి సిపిఎం జిల్లా కార్యదర్శి ప్రభకర్ రెడ్డి, కెవిపిఎస్ నగర కార్యదర్శి ఆర్ నర్సింహులు తదితరులు సంఘీభావం తెలిపారు.