Friday, 6 November 2026

ఆదాయం, సమానతలో తెలంగాణ భేష్

4mmln8ccరాష్ర్టాల ప్రగతి ప్రమాణాలకు సంబంధించి మొత్తం 9 అంశాల్లో నిర్వహించిన సర్వేలో తమిళనాడు నంబర్ వన్ స్థానం దక్కించుకుందని వాణిజ్య మండలి అసోచామ్ తెలిపింది. కేరళకు ఆ తర్వాత స్థానం దక్కింది. ఆర్థిక వ్యవస్థ, ఆదాయం, సమానత, విద్యుత్, విద్య, వైద్యం, రోడ్ల నిర్మాణం, సమగ్రాభివృద్ధి అంశాల్లో రాష్ర్టాల పనితీరు ఆధారంగా ఈ సర్వేను రూపొందించినట్లు అసోచామ్ తెలిపింది. ఈ అధ్యయనంలో 2009-2011 వరకు, ఆపై 2012 నుంచి 2014 మధ్యకాలంలో ప్రగతిని పరిగణలోకి తీసుకున్నారు. ఆదాయం, ప్రజల్లో అసమానతలను రూపుమాపే విషయంలో కేరళ, తెలంగాణ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ర్టాలు మెరుగైన పనితీరు కనబర్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *