Friday, 6 November 2026

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షం

ksibr6e4జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో భారీగా వర్షం కురుస్తోంది. శ్రీనగర్ – జమ్మూ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. మరో 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వర్షం ప్రభావంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *