ఆదోనిలో ఆడపిల్లల రక్షణకు ర్యాలీ
కర్నూలు,మే7(జనం సాక్షి):ఆదోని పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం ‘ఆడపిల్లలకు రక్షణగా కదులుదాం’ పేరిట ర్యాలీ నిర్వహించారు. స్థానిక పురపాలక మైదానంలో డీఎస్పీ ప్రసాద్, ఆర్డీవో ఓబులేశు, పురపాలక కమిషనర్ రామలింగేశ్వర్ జెండా వూపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ..ఆడపిల్లలకు రక్షణగా ఉండేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. మహిళల పట్ల వివక్ష చూపకుండా, దాడులు జరగకుండా వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం ఆడపిల్లలకు రక్షణగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆహారసంఘం డైరెక్టర్ గుడిసె క్రిష్ణమ్మ, తహశీల్దారు శ్రీనాథ్, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్లు సఫరున్సీసా, శాంతిదుర్గ, మండల విద్యాధికారి శివరాములు, వివిధ శాఖల అధికారులు
పాల్గొన్నారు.