చేపలవేటలా రావొద్దు

చీకట్లో రాయి విసిరితే కుదరదు
భారత్‌పై స్విట్జర్‌ల్యాండ్ ఘాటైన వ్యాఖ్యలు
ముంబయి, డిసెంబర్ 7 (జనంసాక్షి) : నల్లధనం దాచుకున్నవారిని గుర్తించడానికి తగిన ఆధారాలుంటేనే రావాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా.. చీకట్లో రాయి విసురుతామంటే కుదరదని స్విట్జర్లాండ్ భారత్‌కు స్పష్టం చేసింది. సొంతంగా దర్యాప్తు చేయకుండానే తమ బ్యాంకుల్లో ఖాతాలున్న భారతీయులందరి వివరాలూ కావాలని అడగడం తగదని పేర్కొంది. భారత్‌లో స్విట్జర్లాండ్ రాయబారి లైనస్ వోన్ కాస్టెల్మర్ ఆదివారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ జరిగిపోయినదానిని మార్చలేమనీ, పన్ను నేరాలపై కనీస స్థాయి ఆధారాలు చూపిస్తే తమ దేశం తరఫÛన పూర్తి సహకారాన్ని అందించడానికి సిద్ధమేనని చెప్పారు. గతంలో స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న ధనమంతా పన్ను చెల్లించిన డబ్బేనని చెప్పలేమనీ, వివిధ మార్గాల ద్వారా అనేక దశాబ్దాల పాటు స్విట్జర్లాండ్‌కు డబ్బు చేరుకునేదని తెలిపారు. దొంగతనంగా పొందిన ఖాతాదారుల జాబితా ఆధారంగా సహకారాన్ని అందించలేమనీ, భారత దర్యాప్తు సంస్థలు కొన్ని ప్రాథమిక ఆధారాలనైనా తీసుకురావాల్సి ఉంటుందని లైనస్ స్పష్టం చేశారు. అక్రమంగా దొంగిలించిన సమాచారాన్ని ్ణగౌరవించలేమనీ, దాని ఆధారంగా పనిచేయలేమని చెప్పారు. భవిష్యత్తులో విదేశీయులు స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే ఆ సమాచారాన్ని సంబంధిత దేశ పన్ను సంస్థలకు అందిస్తామనీ, పారదర్శకంగా వ్యవహరిస్తామనీ చెప్పారు. గతంలో జరిగిన దానిని తవ్వడం కష్టమనీ, యాభై ఏళ్లలో జరిగిన వాటిని మార్చలేమని అన్నారు. పన్ను ఎగవేత నిరోధానికి ఉన్న ద్వైపాక్షిక ఒప్పందం మేరకు పూర్తి సహకారం భారత్‌కు ఇస్తామని చెప్పారు.




