Tuesday, 3 November 2026

నేడు కేంద్రమంత్రులను కలవనున్న సిఎం కెసిఆర్‌

3

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ప్రధాని అధ్యక్షతన జరిగిన సీఎంల సమావేశంలో పాల్గొన్నారు. సోమవారం కూడా కెసిఆర్‌ ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. అందులోభాగంగనే పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఉదయం 11.15 గంటలకు కేంద్ర మంత్రి ఉమాభారతితో సిఎం కెసిఆర్‌ భేటీ కానున్నారు. అక్కడ నుంచి పార్లమెంట్‌కు వెళ్లనున్నారు. అందుబాటులో ఉన్న పలువురు కేంద్ర మంత్రులను కూడా కెసిఆర్‌ కలుస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *