రాయదుర్గం : రాహ్‌గిరి నగరప్రజలను ఆనందాలతో ఉరకలెత్తిస్తోంది. ఈ ఆదివారం గ్రామీణ గళ్లీ క్రీడలు, వినోదాలు సవ్వడి చేశాయి. వీటితోపాటు పలురంగాల్లో నిష్ణాతులైన వారు తమ ప్రతిభ, పాటవాలను నగరప్రజల ముందు ప్రదర్శించేందుకు రాహ్‌గిరిని వేదిక చేసుకుంటున్నారు. ఈ ఆదివారం లైవ్ ఆర్ట్ చిత్రలేఖనం కాన్వాస్‌లు, ఐటీ కారిడార్‌లో చేపట్టిన కార్ ఫ్రీ థర్స్‌డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు డాక్టర్ అలేఖ్య హులాహుప్స్ ద్వారా శరీర ఆకృతిని ఎలా కాపాడుకోవచ్చో వివరించారు. హెల్దీలైఫ్‌స్టైల్ గురించి పలువురు రాహ్‌గిరికివచ్చినవారికి వివరించారు.
ఆనందాన్ని ఉరకలెత్తిస్తున్న రాహ్‌గిరి




