Tuesday, 3 November 2026

ఆనాటి హామీలు అమలు చేయండి : మన్మోహన్

636060059513062519న్యూఢిల్లీ : విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఆరు హామీలు ఇచ్చానని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో మన్మోహన్ ప్రసంగించారు. నాటి ప్రధానిగా తాను రాజ్యసభలో ఇచ్చిన హామీలకు అప్పటి ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ సంతృప్తి చెందారని గుర్తు చేశారు. అలాగే అప్పటి కేబినెట్‌ నిర్ణయం కూడా తీసుకుందన్నారు. ఆర్డినెన్స్‌ కోసం రాష్ట్రపతికి పంపించామన్న మన్మోహన్ ఎన్నికల కోడ్‌ వల్ల ఆర్డినెన్స్‌ ఆగిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆర్డినెన్స్‌ను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. హామీలను అమలు చేసి సభ గౌరవాన్ని కాపాడాలని మన్మోహన్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *