రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలలో ఎలాంటి అక్రమాలు లేకుండా చూస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇసుక తవ్వకాలపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఆయన శాసనమండలిలో సమాధానం చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో ఇసుక తవ్వకాలు రాజకీయ నేతలకు ఉపాధి పథకంగా మారింది వాస్తవమేనని.. కానీ ఇప్పుడు పూర్తిగా పరిస్థితులు మారాయన్నారు. ఆన్ లైన్ లోనే ఇసుకను బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 8 క్వారీల నుంచి ఇసుకను పొందవచ్చన్నారు. ఇంకా 35 క్వారీల కోసం పర్యావరణ అనుమతులు లభిస్తే.. ఇసుక కొరత లేకుండా పోతుందన్నారు.
ఆన్ లైన్ లోనే ఇసుక బుకింగ్




