Tuesday, 3 November 2026

ఆపరేషన్‌ ఫ్రాన్స్‌ సక్సెస్‌..

ఇద్దరి మిలిటెంట్ల హతం
ఫ్రాన్స్‌ టెర్రిజంపై యుద్దం కొనసాగిస్తుంది – ప్రధాని
ప్యారిస్‌,జనవరి9(జనంసాక్షి): ప్యారిస్‌లోని చార్లి హెబ్డో పత్రికా కార్యాలయంపై దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో హతమయ్యారు. డమార్టన్‌ ఎన్‌ గోయిల్‌లోని ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో దాక్కున్న ఉగ్రవాదులు సయూద్‌ కోచి, చెరిఫ్‌ కోచిలను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దీంతో ఉగ్రవాదుల చెరలో ఉన్న బందీలకు విముక్తి లభించింది. ఆపరేషన్‌ పూర్తయినట్లు స్థానిక మేయర్‌ ప్రకటించారు. పారిస్‌లో ఉదయం నుంచి సాగుతున్న హైడ్రామాకు ముగింపు లభించింది. ఈ ఆపరేషన్‌లో హెలికాప్టర్లు సహా వెయ్యిమంది భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. ప్యారిస్‌లో వరసగా మూడోరోజూ కాల్పుల సంఘటన జరిగింది. ఈశాన్య ప్యారిస్‌లో అనుమానాస్పదంగా ఉన్న ఓ కారును వెంబడిస్తుండగా ఈ కాల్పులు జరిగాయి. చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై దాడి ఘటనలో బాధ్యులుగా అనుమానిస్తున్న ఇద్దరు సోదరులే దొంగిలించిన కారులో వెళ్తుండగా అధికారులు వెంబడించారని ఈ సందర్భంగా దుండగులు కాల్పులు జరిపారని ప్యారిస్‌ భద్రతాదళాలను ఉటంకిస్తూ వార్తలు వచ్చాయి. ప్యారిస్‌ సమీపంలోని డమార్టన్‌ ఎన్‌ గోయిల్‌ వద్ద ఈ సంఘటన జరిగింది.

కాల్పుల్లో ఒకరు మృతి

పారిస్‌కి ఈశాన్య ప్రాంతంలో జరిగిన నేటి కాల్పుల ఘటనలో ఒకరు మృతిచెందారని, కొందరు గాయపడ్డారని ఫ్రెంచి రేడియో ఆర్‌టీఎల్‌ పేర్కొంది. కాల్పుల జరిపిన ప్రాంతానికి అంబులెన్స్‌లు చేరుకున్నాయి. పోలీసులు వెంబడించడంతో నిందితులు ఓ గోదాములో దాక్కున్నట్లు తెలుస్తోంది. వారు గోదాములో పనిచేసే మహిళను బందీగా తీసుకోగా… సంఘటనా స్థలాన్ని చుట్టుముట్టిన పోలీసులు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు.

సంఘటనాస్థలాన్ని చుట్టుముట్టిన బలగాలు

ప్యారిస్‌లో ఈరోజు కాల్పులు జరిగిన ఘటనాస్థలాన్ని భద్రతాదళాలు చుట్టుముట్టాయి. పోలీసులు హెలికాప్టర్ల ద్వారా ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఉత్తర ఫ్రాన్స్‌లో అణువణువునూ పోలీసులు గాలిస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని.. తలుపులు, కిటికీలు మూసి ఉంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

పౌరుల రక్షణ కోసం ఏమైనా చేస్తాం: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

ఫ్రాన్స్‌లో ప్రజలందరూ ఫ్రాన్స్‌ రిపబ్లిక్‌లో భాగమని, ప్రజల రక్షణకు హామీ ఇస్తున్నామని ఫ్రెంచి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌  లాండే పేర్కొన్నారు. సాధారణ పౌరుల రక్షణ కోసం ప్రభుత్వం ఏమైనా చేస్తుందని ఆయన స్పష్టంచేశారు. పారిస్‌లో వరుసగా మూడో రోజు కాల్పులు కొనసాగుతున్నాయి. శుక్రవారం చార్లి హెబ్డో పత్రికా కార్యాలయంపై దాడులు జరిపిన నిందితులను పట్టుకునే క్రమంలో నిందితులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. ఓ భవనంలో దాక్కున్న నిందితులు ఓ

ఫ్రాన్స్‌లో ఉగ్రవాదుల వరుస కాల్పుల నేపథ్యంలో వారిని పట్టుకునేందుకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాన మంత్రి మాన్యూల్‌ వాల్స్‌ మాట్లాడుతూ ఫ్రాన్స్‌ టెర్రరిజంపై యుద్ధం చేస్తోందని, మతం మీద కాదని పేర్కొన్నారు.

ఫ్రాన్స్‌ టెర్రిజంపై యుద్దం కొనసాగిస్తుంది – ప్రధాని

ఫ్రాన్స్‌లో ఉగ్రవాదుల వరుస కాల్పుల నేపథ్యంలో వారిని పట్టుకునేందుకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాన మంత్రి మాన్యూల్‌ వాల్స్‌ మాట్లాడుతూ ఫ్రాన్స్‌ టెర్రరిజంపై యుద్ధం చేస్తోందని, మతం విూద కాదని పేర్కొన్నారు.ఫ్రాన్స్‌లోప్రజలందరూ ఫ్రాన్స్‌ రిపబ్లిక్‌లో భాగమని, ప్రజల రక్షణకు హావిూ ఇస్తున్నామని ఫ్రెంచి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌  లాండే పేర్కొన్నారు. సాధారణ పౌరుల రక్షణ కోసం ప్రభుత్వం ఏమైనా చేస్తుందని ఆయన స్పష్టంచేశారు. పారిస్‌లో వరుసగా మూడో రోజు కాల్పులు కొనసాగుతున్నాయి. ప్యారిస్‌ విమానాశ్రయంలో రెండు రన్‌వేలు మూసివేశారు. చార్లి హెబ్డొ ఘటన తాలూకు ఉగ్రవాదుల గాలింపులో సుమారు 80,000 మంది పోలీసు అధికారులు పనిచేస్తున్నారని అక్కడి విూడియా తెలిపింది.మరోవైపు బ్రిటన్లో కూడా భారీ సంఖ్యలో సామాన్యుల ప్రాణాలను బలిగొనేందుకు అల్‌ కాయిదా ఉగ్రవాద సంస్థ కుట్రలు పన్నుతోంది. ఈ విషయాన్ని స్వయంగా బ్రిటిష్‌ నిఘా సంస్థ అత్యున్నత అధికారే వెల్లడించారు. ఏదైనా ప్రయాణికుల విమానాన్ని పేల్చేయడం గానీ, ముంబై తరహాలో రద్దీ ప్రదేశాల్లో కాల్పులు జరపడం గానీ, లేదా వాహనాలను ఉపయోగించి హిట్‌ అండ్‌ రన్‌ దాడులు గానీ చేయొచ్చని అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు ఈ రకమైన కుట్ర పన్నుతున్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని ఎంఐ5 సెక్యూరిటీ సర్వీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆండ్రూ పార్కర్‌ చెప్పారు. ఇటీవలి కాలంలో బ్రిటిష్‌ పోలీసులు, ఎంఐ5 కలిసి మూడు ఉగ్రవాద కుట్రలను భగ్నం చేశాయన్నారు. అయితే, ప్రతిసారీ కుట్రలను తాము అడ్డుకోగలమని మాత్రం వీలైనంత వరకు తాము ప్రయత్నం చేస్తూనే ఉంటామని.. అయితే.. వాళ్లు కూడా రాను రాను కొరకరాని కొయ్యల్లా తయారవుతున్నారని పార్కర్‌ వ్యాఖ్యానించారు.ప్యారిస్‌ తరహా దాడులకు కొంతమంది ఉగ్రవాదులు పాల్పడతారేమోనన్న అనుమానంతో బ్రిటిష్‌ పోర్‌ట్లాండ్‌ సాయుధ పోలీసులు అణువణువూ గాలిస్తున్నారు. లండన్‌ లోని యూరోస్టార్‌ టెర్మినల్‌ వద్ద భద్రత పెంచారు. ఇప్పటికే సిరియా, ఇరాక్‌ దేశాల నుంచి కొంతమంది బ్రిటిష్‌ జీహాదీలు స్వదేశానికి తిరిగి వస్తున్నారని, వాళ్లు ఈ దాడులకు తెగబడే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. బ్రిటన్‌ నుంచి సిరియా వెళ్లిన 600 మంది బ్రిటిష్‌ వాళ్లలో ఎక్కువ మంది ఐఎస్‌ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు తెలుస్తోంది.

3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *