పేదలకు ఇళ్ల స్థలాలు, పెన్షలు
రెండవ రోజు మురికి వాడల్లో సీఎం పర్యటన
సర్వే చేయాలనీ అధికారులకు ఆదేశం
వరంగల్,జనవరి9(జనంసాక్షి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గం దీన్‌దయాళ్‌లోని మురికి వాడల్లో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం పరిశీలించారు. వరంగల్, హన్మకొండలో 500 ఎకరాల్లో మురికి వాడలు ఉన్నాయని,. దశలవారీగా మురికివాడలన్నింటినీ అభివృద్ధి పరుస్తామన్నారు. మొదటగా దీన్‌దయాళ్ నగర్‌లోని మురికివాడలను అభివృద్ధి చేస్తామన్నారు. కాలనీలోని పేదవాళ్లందరికి నివాస ధృవీకరణ పత్రాలు అందజేసి, వాళ్లందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. దీన్‌దయాళ్ బస్తీ వాసులంతా ఇంట్లోనే ఉండాలని, శనివారం ఉదయం నుంచి సాయంత్ర వరకు అధికారులు బస్తీలో సర్వే చేసి, రాత్రి వరకు పట్టాలు తయారుచేస్తారని హావిూఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా పేదప్రజల అభివృద్ధికి పాటుపడుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పేదలకు రేషన్ కార్డులు పెన్షన్లు అందుతాయని అన్నారు. ఎవరికి కూడా అన్యాయం జరక్కుండా చూసుకుంటానని అన్నారు. శుక్రవారం ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం దీన్‌దయాళ్ నగర్‌లోని మురికివాడలను పరిశీలించారు. అనంతరం అక్కడి ప్రజలతో స్థానిక సమస్యలపై చర్చించారు. పలు సమస్యలను స్థానికులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. భూపాలపల్లి నుంచి తిరిగివచ్చిన తర్వాత ఎల్లుండి తానే స్వయంగా బస్తీవాసులకు పట్టాలు అందిస్తానన్నారు. . అదేవిధంగా రేషన్‌కార్డులు, పెన్షన్లపై కూడా అధికారులు సర్వే చేసి అర్హులను గుర్తిస్తారని చెప్పారు. వారికి కూడా తన చేతుల విూదుగానే ఎల్లుండి అందజేస్తానని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ లో రెండోరోజు పర్యటించారు. గురువారం సాయంత్రం ఇక్కడికి వచ్చిన సిఎం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని స్లమ్ ఏరియాల్లో తిరిగి ఉదయం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని దీన్ దయాల్ నగర్, భవానీనగర్, అంబేద్కర్ నగర్, విూర్ సాహెబ్, ప్రగతి నగర్‌లలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వెంటరాగా డిప్యూటీ సీఎం రాజయ్యతో కలిసి మురికివాడల్లో ప్రజల సమస్యలను విన్నారు. దీన్ దయాల్ నగర్ లో నేలపై కూర్చుని ప్రజల మధ్యలో వారితో మాట్లాడిన కేసీఆర్ వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వారికి ఆహారభద్రత కార్డులు, పింఛన్లు అందుతున్నాయా అంటూ ఆరా తీశారు. స్లమ్ ఏరియాల్లో రోడ్ల అధ్వాన్న స్థితిని చూసిన సీఎం అక్కడే ఉన్న ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులంతా లోతట్టు ప్రాంతాల ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. గురువారం వరంగల్ నగరంలోని మురికివాడలను సందర్శించారు . హైదరాబాద్ నుండి ప్రత్యేక హేలికాప్టర్లో హన్మకోండ ఆర్ట్సకళాశాల మైదానంనకు చేరుకున్నారు . నేరుగా వరంగల్ తూర్పునియెజక వర్గంలోని .శాకరాసికుంట, భగత్ సింగ్ నగర్ , లక్ష్మినగర్ , గాంధీనగర్ , మురికివాడల్లో పర్యటించిన ముఖ్యమంత్రి సమస్యలను తెలుసుకున్నారు మురికివాడలదుస్థితిపై ఆగ్రం వ్యక్తం చేస్తూ నగరం ను పరిశుభ్రమైన నగరంగా చర్యలు తీసుకోవాలని ఆధికారులకు ఆదేశాలు జారిచేశారు. ముఖ్యమంత్రి మాట్టాడుతూ మురికివాడలు లేని వరంగల్ ను చూడాలని పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని సంబందిత ఆధికారులకు ఆదేశాలు జారిచేశారు ముఖ్యమంత్రి వెంట ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య,రాష్ట్ర పర్యాటక,గిరిజనశాఖ మంత్రి చందూలాల్, పార్లమెంటరీ కార్యదర్శి వినయ్ భాస్కర్, స్థానిక శాసన సభ్యరాలు కొండా సురేఖ, యం.పి.లు కడియం శ్రీహరి ,సీతారాంనాయక్ ఎమ్మెల్యేలు,మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి , కమిషనర్ తో పాటు జిల్లాకలెక్టర్ జి.కిషన్ , మున్సిపల్ కమిషనర్ లు ఉన్నారు




