గ్రామాలకు ప్రత్యేకాధికారాలు
కేజ్రీవాల్‌పై దాడి
కాఫీ విత్ కేజ్రీవాల్ కార్యక్రమంతో మమేకం
న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ప్రచారంలో భాగంగా ఆప్ భారీ ర్యాలీలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆప్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కేజ్రీవాల్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆమ్ ఆద్మీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు భారీ స్పందన లభిస్తుండటంతో విజయంపై ఆప్ ధీమాగా ఉంది. తిరిగి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తారన్న విశ్వాసం పార్టీలో మెండుగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే కేజ్రీవాల్‌పై దాడుల పర్వం మాత్రం కొనసాగుతునే ఉంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ యువకుడు దాడికిదిగాడు. శనివారం పశ్చిమఢిల్లీలోని దియోలీ అసెంబ్లీ నియోజకవర్గంలోని తిగ్డిలో ఈ ఘటన జరిగింది. వివరిలా ఉన్నాయి.. దియోలీ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీని ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతుండగా ఓ యువకుడు మధ్యలో కేకలు వేస్తూ ఆయనపైకి రాయి విసిరాడు. అప్రమత్తమైన ఆప్ కార్యకర్తలు ఆ యువకుడికి అడ్డుతగలడంతో విసిరిన రాయి పోడియం సవిూపంలో పడింది. ఈ ప్రమాదంలో కేజ్రీవాల్‌కు త్రుటిలో ముప్పు తప్పింది.
ఈ దాడిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘తనను భయపెట్టేందుకే బీజేపీ ఇలాంటి కుట్రలకు ఊతమిస్తోందని’ ట్విట్ చేశారు. దియోజీ జనసభలో మాట్లాడుతుండగా ఒక యువకుడు తనపై రాయి విసిరాడు. బీజేపీ ఘర్షణలు సృష్టించి భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోందని, అందుకే ఇలాంటి దాడులకు ఉసిగొల్పుతోందని అన్నారు. తనపై దాడికి దిగిన యువకుడిని కేజ్రీవాల్ అభినందించారు. అనంతరం జనసభలో గందరగోళం సృష్టించిన ఆ యువకుడిని కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించడంతో ప్రచారం సుఖాంతమైంది.





