Friday, 6 November 2026

ఆభరణాలపై నాకేం తెలియదు: పురవాస్తు శాఖ మాజీ అధికారి

 అమరావతి,మే22(జ‌నం సాక్షి):2011లోనే టిటిడిలో ఉన్న పురాతన ఆభరణాలను పరిశీలించామని పురావస్తుశాఖ మాజీ డైరెక్టర్‌ చెన్నారెడ్డి తెలిపారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ కృష్ణదేవరాయలు తిరుమలతో పాటు ఇతర ఆలయాలకు విలువైన ఆభరణాలు ఇచ్చారని అయితే చాలా దేవాలయాల్లో రికార్డులు సరిగా నిర్వహించలేదన్నారు. అప్పటి ఆభరణాల్లో 10 శాతం ఆభరణాలను మాత్రమే గుర్తించామని, ఆభరణాలను పరిరక్షించాల్సిన అవసరముందని తెలిపారు. టిటిడిలో నెలకొన్న ప్రస్తుత వివాదం విూద తాను స్పందించనని చెన్నారెడ్డి అన్నారు.