మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు
తిరుపతి,మే22(జనం సాక్షి): తిరుమల వ్యవహారాల్లో మింగుడుపడని విషయాలు వెల్లడించిన మాజీ ప్రధాన అర్చకులు డిక్టర్ రమణ దీక్షితులు ఆమరణ దీక్షకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీలో దీక్ష చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కైంకర్యాల లోపం, ఇతర అక్రమాలపై రమణ తీవ్రంగా స్పందించారు. తిరుమల వివాదాలపై తక్షణమే ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ దీక్షకైన సిద్ధమని రమణ దీక్షితులు సన్నిహితులకు తెలిపారు. లోపాలను ఎత్తి చూపితే తనపై టిటిడి ఎదురుదాడి చేయిస్తోందని రమణ వాపోయారు. తన వ్యక్తిత్యాన్ని దెబ్బతీసేందుకు టిటిడి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టిటిడిలో 65 ఏళ్లు పైబడిన అర్చకులకు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో నలుగురు ప్రధాన అర్చకులు తమ పదవులను కోల్పోయారు.
——–




