ఆరుగురు క్రికెటర్లకు పాక్ కాంట్రాక్టర్లు
లా¬ర్,నవంబర్ 30: క్రికెటర్ల కాంట్రాక్టుల విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మిగిలిన దేశాల కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆరుగురు క్రికెటర్లకు షార్ట్ కాంట్రాక్టులు ఇస్తున్నట్టు ప్రకటించింది. వీరంతా ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కని వారే. పేస్ బౌలర్లు మహ్మద్ తల్హా , మహ్మద్ సమి , తనీష్‌ఖాన్ , ఉమైద్ ఆసిఫ్ , ఆల్‌రౌండర్ ఫావద్ అలం , లెగ్‌స్పిన్నర్ యాసిర్ షాలకు నాలుగు నెలల స్వల్ప కాంట్రాక్ట్ ఇచ్చినట్టు పిసిబీ తెలిపింది. దీని ప్రకారం వీరికి నెలకు 40 వేల చొప్పున లభిస్తుంది. సెప్టెంబర్ నుండి ఈ ఒప్పందం అమలులో ఉందని వెల్లడించింది. వీరి ఆటతీరును పరిశీలించిన తర్వాత సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే స్వల్ప కాలపు కాంట్రాక్టులు పొందిన ఈ ఆరుగురు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన వారితో పోలిస్తే తమకు చాలా తక్కువ మొత్తం వస్తోందని వీరు చెబుతున్నారు. పిసిబీ ఈ ఏడాది ప్రకటించిన ఒప్పందాల ప్రకారం కేటగిరీ ఎ ప్లేయర్లు నెలకు 313000 , మిగిలిన వారికి కనీసం 75 వేల చొప్పున అందుకుంటున్నారు. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి జాతీయ జట్టులోకి తిరిగి వచ్చిన సవిూ , తల్హా బోర్డు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంక టూర్‌కు ఎంపికైనప్పటి నుండీ నిలకడగా రాణిస్తున్నా… సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకుండా , తక్కువ మొత్తంలో మ్యాచ్ ఫీజులు కేటాయించడం సరికాదని సవిూ అంటున్నాడు. ప్రస్తుతం ప్లేయర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో ఈ వివాదం పిసిబి ఛైర్మన్ జాకా అష్రాఫ్ దృష్టికి వెళ్ళింది. ప్రస్తుతం భారత పర్యటనకు సంబంధించిన పనులతో బిజీగా ఉన్న అష్రాఫ్ త్వరలోనే ఆటగాళ్ళ కాంట్రాక్టులపై జోక్యం చేసుకుంటారని హావిూ ఇచ్చినట్టు తెలుస్తోంది.