కరెన్సీనగర్, విజయవాడ : ఆంధ్రా లయోలా కళాశాలలో పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ కోసం వచ్చిన అభ్యర్థులకు చెందిన ఆరు ద్విచక్రవాహనాలు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. కళాశాలలోని దేవయ్య ఆడిటోరియం రోడ్డు పక్కన ద్విచక్రవాహనాలను విద్యార్థులు పార్కింగ్ చేసి కౌన్సెలింగ్కు వెళ్లారు. రోడ్డు పక్కనే ఉన్న చెత్తకు నిప్పంటుకుని బైక్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.




