¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
కాశ్మీర్, నవంబర్ 19 (జనంసాక్షి) : ఆర్టికల్ 370పై తమ పార్టీ చర్చకు సిద్ధమేనని ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టంచేశారు. ఈ అధికరణ జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే 370వ అధికరణాన్ని (ఆర్టికల్-370) రద్దుచేసే విషయమై చర్చించడానికి భాజపా సిద్ధంగా ఉందని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తాజాగా ప్రకటించారు. అయితే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇది ఎన్నికల సమయంలో లేవనెత్తే అంశంకాదని స్పష్టంచేశారు. కిష్ట్వార్ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన పద్దార్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘ఆర్టికల్-370ని రద్దుచేయడం జాతీయ అంశం. దానిపై చర్చ జరగాలి. దానిపై భాజపా వైఖరి సుస్పష్టం. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల సమయంలో దీనిని లేవనెత్తవద్దని ఇతరపార్టీలనూ కోరుతున్నాన’ని అన్నారు. సుపరిపాలన, అవినీతి నిర్మూలన, అభివృద్ధి, జమ్మూ కశ్మీర్‌ను శాంతికి నమూనాగా మార్చడం వంటి అంశాలపై తమ పార్టీ దృష్టిసారిస్తోందన్నారు.





