Monday, 2 November 2026

తెలంగాణకు సాయమందించండి

5
కేంద్రాన్ని కోరిన ఆర్థిక మంత్రి ఈటెల

న్యూఢిల్లీ,డిసెంబర్‌26(): తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి అండగా ఉండాలని కేంద్రాన్ని కోరినట్లు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. న్యూల్లీలో ఆర్థికమంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  రాష్టాన్రికి రావాల్సిన బకాయిలన్నీ బ్జడెట్‌లోగా ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ కార్యక్రమానికి రూ.25వేల కోట్లు సాయం చేయాలని కేంద్రాన్ని కోరామని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ఆర్థిక మంత్రుల సమావేశం అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ తెలంగాణ చెరువుల పునరుద్ధరణలో భాగం కావాలని కేంద్రాన్ని కోరినట్టు పేర్కొన్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇచ్చి సహాయ, సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు. అదేవిధంగా ప్రాణహితకు జాతీయ ¬దాను కల్పించాలని కోరడంతోపాటు రోడ్ల మరమ్మతులకు, తాగునీటి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని ఆయన స్పష్టం చేశారు.దేశంలో గొప్పగా నడిచే వసతిగృహాలు తెలంగాణలోనే ఉన్నాయని… జనవరి 1 నుంచి వసతిగృహాలకు సన్నబియ్యం అందిచనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల అవసరార్ధం బియ్యం కోటాను మరింత పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని హాస్టళ్లకు ఇచ్చే 3వేల మెట్రిక్‌టన్నుల బియ్యాన్ని 9వేల మెట్రిక్‌ టన్నులకు పెంచాలని కేంద్రాన్ని కోరామని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఈ మేరకు ఇవాళ పుడ్‌ ప్రాసెసింగ్‌ మినిస్టర్‌ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ విద్యార్థులకు పెట్టే ఖర్చులను పెట్టుబడిలా చూడాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు. ఏపీకి నిర్దేశించిన దారిద్యర్రేఖ తెలంగాణకు సరిపోదని మంత్రికి వివరించామని తెలిపారు. జనవరి 1నుంచి రాష్ట్రంలోని వసతి గృహాలకు సన్నబియ్యం అందిస్తామని ఈటెల రాజేందర్‌ ఉద్ఘాటించారు. విద్యార్థుల అవసరార్థం బియ్యం మరింత పెంచాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు.కొత్తగా రాష్ట్రం ఏర్పాటైంది కాబట్టి కేంద్రం మద్దతు కావాలని కోరినట్టు తెలిపారు. తెలంగాణ సమస్యలపై ప్లానింగ్‌ కమిషన్‌కు వివరించామని పేర్కొన్నారు. రాష్టాన్రికి రావాల్సిన బకాయిలను బడ్జెట్‌లోపు ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినట్టు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *