– మంత్రి మహేందర్ రెడ్డి
నిజామాబాద్,అక్టోబర్27(జనంసాక్షి ): రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచే యోచన లేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లో పర్యటించిన ఆయన మంగళవారం విూడియాతో మాట్లాడారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. కాగా కొత్తగా ఆర్టీసీ డిపోలను ఏర్పాటు చేయడం లేదని.. ఉన్నవాటినే మరింత మెరుగు పరచనున్నట్లు మహేందర్ రెడ్డి వివరించారు. త్వరలో అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు మహేందర్ రెడ్డి సమాధానం ఇచ్చారు.వరంగల్ లోక్‌సభ, మెదక్ జిల్లా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలకు ఉనికేలేదని ఎద్దేవా చేశారు. వరంగల్‌లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థే కరువయ్యాడని అన్నారు. రాష్ట్రంలో రోజు 93 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 6 డిపోల్లో రూ.26 కోట్లతో అభివృద్ధి పనులను చేపడతామన్నారు. బస్టాండ్లను అన్ని విధాలా తీర్చి దిద్దుతామని తెలిపారు. వరంగల్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుస్తామని ఆయన అన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని మంత్రి మహేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. మూసేసిన ఆర్టీసీ డిపోలను తెరిచే ఆలోచన లేదన్న మంత్రి ఉన్నవాటినే మెరుగుపరుస్తామని తెలిపారు
ఆర్టీసీ మోతలుండవు




