Tuesday, 3 November 2026

ఆశాలు..100 రోజులు..100 కి.మీటర్లు..

hfjsx3zk

హైదరాబాద్ : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వంద రోజులు..! అవును ఆశా వర్కర్లు సాగిస్తున్న సమ్మె వందరోజులు పూర్తి చేసుకుంది. నిరవధికంగా మూడు నెలలకు పైబడి పోరాడుతున్నా.. పాలకలు పట్టించుకోక పోవడంతో.. రోజుకో తీరుగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. తమ సమ్మె వంద రోజులు పూర్తయిన సందర్భంగా.. వంద కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు.. ఆశాలు. ఆశా వర్కర్లు. సీఐటీయూ ఆధ్వర్యంలో.. రాష్ట్రం నలుమూలలా ర్యాలీలు.. పాదయాత్రలు చేపట్టారు. హైదరాబాద్‌లో బషీర్‌బాగ్‌ చౌరస్తా నుంచి సుందరయ్య పార్కువరకూ నిరసన ర్యాలీ చేశారు..

వరంగల్..మహబూబ్ నగర్ లో..
రంగల్‌ జిల్లాలోకూడా ఆశాల ఉద్యమం జోరుగా సాగుతోంది.. పాలకుర్తినుంచి నగరానికి పాదయాత్ర చేపట్టారు. కార్యకర్తలు.. ఈ కార్యక్రమంలో.. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి పాల్గొన్నారు.. మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో ఆశా వర్కర్ల పాదయాత్ర మొదలైంది.. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఇందులో పాల్గొన్నారు.. వందరోజులుగా దీక్ష చేస్తున్న కార్యకర్తల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు రాఘవులు.. ఈ పాదయాత్ర జడ్చర్ల, షాద్ నగర్ మీదుగా ఈనెల 17న హైదరాబాద్ చేరుకుంటుంది..

మెదక్..కరీంనగర్ లో..
మెదక్‌ జిల్లా జహీరాబాద్‌లో వంద కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు.. కోట్ల బడ్జెట్‌ అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం… ఆశాలకు 5వేల రూపాయల జీతం ఇవ్వకపోవడం అన్యాయమని మండిపడ్డారు.. జహీరాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు ఎనిమిది రోజులపాటు ఈ యాత్ర చేయనున్నారు కార్యకర్తలు. కరీంనగర్‌ జిల్లాలో వంద రోజులు వంద కిలోమీటర్లంటూ ఆశాలు పాదయాత్ర చేపట్టారు.. సిరిసిల్లలో జరిగిన సభలో 4వందల మంది కార్యకర్తలు పాల్గొన్నారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

నిజామాబాద్..ఆదిలాబాద్ లో..
నిజామాబాద్‌ జిల్లాలోకూడా ఆశాలు నిరసన తెలిపారు.. పూలే విగ్రహానికి పూలమాలలు వేసిన సీఐటీయూ నేతలు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంనుంచి పాదయాత్ర మొదలుపెట్టారు..ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌, టీడీపీ పార్టీలు మద్దతు ప్రకటించాయి.. ఆదిలాబాద్‌ జిల్లాలోకూడా ఆశాల నిరసనలు కొనసాగుతున్నాయి.. కెరమెరినుంచి నగరంవరకూ వందమంది ఆశాలు వంద కిలోమీటర్ల పాదయాత్ర మొదలుపెట్టారు.. ఈ కార్యక్రమాన్ని సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *