Tuesday, 3 November 2026

ఆస్కార్‌ బరిలో మళ్లీ ఎ.ఆర్‌ రహమాన్‌

2

లాస్‌ఏంజల్స్‌ డిసెంబర్‌ 13 (జనంసాక్షి) : రెండు ఆస్కార్‌ అవార్డులు అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ మరోసారి ఆస్కార్‌ బరిలో నిలిచారు. రెహ్మాన్‌ స్వరాలు

సమకూర్చిన మూడు చిత్రాలు 87వ అస్కార్‌ అవార్డుల ఒరిజినల్‌ స్కోర్‌ కేటగిరిలో నామినేషన్లు సాధించాయి. మిలియన్‌ డాలర్‌ ఆర్మ్‌, ద హండ్రెడ్‌ ఫుట్‌ జర్నీ, రజనీకాంత్‌ హీరోగా నటించిన కొచ్చాడయాన్‌ చిత్రాలకుగానూ రెహ్మాన్‌కు నామినేషన్లు దక్కాయి. 2009లో స్లమ్‌డాగ్‌ మిలియనియర్‌ చిత్రం ద్వారా ఆయనకు రెండు అవార్డులు వచ్చిన

విషయం తెలిసిందే. ఒరిజినల్‌ స్కోర్‌ కేటగిరీలో మొత్తం 114 చిత్రాలు పోటీపడుతున్నాయి. ఈ అవార్డుల తుది నామినేషన్లను వచ్చే ఏడాది జనవరి 15న ప్రకటిస్తారు. అవార్డుల ప్రధానోత్సవం ఫిబ్రవరి 22 జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *