Tuesday, 3 November 2026

మంత్రి వర్గ విస్తరణకు 16న ముహూర్తం

 

3ఆరుగురికి అవకాశం

జూపల్లి, లక్ష్మారెడ్డి, తుమ్మల, సురేఖ, తలసాని, చంద్‌లాల్‌కు ఛాన్స్‌

చీఫ్‌ విప్‌గా కొప్పుల

గవర్నర్‌తో కేసీఆర్‌ సమావేశం

 

హైదరాబాద్‌ డిసెంబర్‌ 13 (జనంసాక్షి) :: తెలంగాణ మంత్రివర్గంలో ఆరుగురికి చోటు దక్కినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. రాజ్‌భవన్‌లో శనివారం గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయిన ఆయన… మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పటివరకూ కేసీఆర్‌ తో

పాటు 12మంది ఉన్నారు. కాగా నిబంధనల ప్రకారం తెలంగాణ కేబినెట్‌ లో 18మంది వరకూ ఉండవచ్చు.

మంత్రివర్గంలో తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మారెడ్డి, కొండా సురేఖ, చందూలాల్‌, జూపల్లి కృష్ణారావు పేర్లు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. మరొకరి కూర్పుపై కసరత్తు చురుగ్గా సాగుతోంది. కాగా ఆదిలాబాద్‌ నుంచి ఇంద్రకరణ్‌ రెడ్డికి మంత్రివర్గంలో ఛాన్సు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పదవులు రానివారికి చీఫ్‌ విప్‌, విప్‌ పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. చీఫ్‌ విప్‌గా కొప్పుల ఈశ్వర్‌, విప్‌లుగా నల్లాల ఓదేలు, సునీతా మహేందర్‌ రెడ్డి, గంపా గోవర్థన్‌ పేర్లు పరిశీలించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. శనివారం ఉదయం రాజ్‌ భవన్‌ కు వచ్చిన ముఖ్యమంత్రి సుమారు అరగంట సేపు గవర్నర్‌ తో సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణ జరగొచ్చని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి గవర్నర్‌ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకొంది. కేబినెట్‌ విస్తరణతో పాటు, ఢిల్లీలో గవర్నర్‌ నరసింహన్‌ పర్యటనపైనా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది..తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఈనెల 17న జరిగే అవకాశం ఉంది. మంచి రోజు కావడంతో 17న విస్తరణ జరపాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *